UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి రోజు కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య గురువారం నాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ – పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. రొటీన్ కథ, కథనం బోర్ కొట్టించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పక్కనే విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ ప్రభావం ఈ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.
Also Read : Siddhu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – సితార ఎంటరైన్మెంట్స్.. సినిమా స్టార్ట్
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆఫ్ లైన్ టికెటింగ్ కాకుండా, ఆన్ లైన్ డేటా ప్రకారం ఇండియా వైడ్ గా ఈ చిత్రం 5,359 షోల ద్వారారూ. 31.86 కోట్లు రాబట్టింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01% గా నమోదైంది. ఆంధ్రా ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఇక్కడ రూ. 19.40 కోట్లు వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35% గా నమోదైంది. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక్కడ కేవలం రూ.9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణం హిందీ సినిమా ‘ధురంధర్ 2’ వేవ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాలతో యూఎస్ మరియు ఇతర దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఓవరాల్‌గా మొదటి రోజు ప్రదర్శన అండర్వెల్మింగ్ గానే మిగిలిందని సినీ వర్గాల అభిప్రాయం.
Note : ఈ కలెక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించినవి కాదు. వివిధ మార్గాల ద్వారా సేకరించి అందజేస్తున్నాం..
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!