పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ మార్చి 19 అని దగ్గరపడుతున్నా, చిత్ర యూనిట్ నుంచి ఆశించిన స్థాయిలో హడావుడి కనిపించడం లేదు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ అయినట్లు సమాచారం.
Also Read : Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడానికి 15 రోజుల ముందే ప్రమోషన్లు హోరెత్తుతాయి. కానీ, ‘ఉస్తాద్’ విషయంలో ఇంకా సందడి మొదలుకాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేదు. కేవలం 8 రోజులే సమయం ఉండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు ప్రమోషన్లు లేకుండానే సినిమాను థియేటర్లలోకి దించుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో సెకండ్ షో తర్వాత రాత్రి 11 గంటలకు ప్రీమియర్స్ వేసుకునే పర్మిషన్లు ఉన్నప్పటికీ, ఉస్తాద్ టీమ్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక టికెట్ రేట్ల విషయానికొస్తే.. సంక్రాంతి సినిమాల రేట్ల పెంపుపై న్యాయస్థానం సీరియస్ అయిన నేపథ్యంలో, ఉస్తాద్ మేకర్స్ ఆ సాహసం చేస్తారా అన్నది చూడాలి. ఇటీవల ‘రాజా సాబ్’ సినిమా టికెట్ రేట్ల పెంపు వల్ల ఓపెనింగ్స్‌పై ప్రభావం పడిందని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నార్మల్ రేట్లకే సినిమాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. హైక్ లేకుండా, ప్రీమియర్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ రాబట్టడం సవాలే. కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది కానీ, మొదటి రోజు రికార్డుల కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఈ మిగిలిన కొద్ది రోజుల్లో ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వస్తారో వేచి చూడాలి.
