Megastar Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది! ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగా బ్లెస్సింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటుంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.
READ ALSO: Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
మెగా రియాక్షన్..
చిరంజీవి తనదైన శైలిలో చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.. “మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో అన్నీ శుభాలే!!” అంటూ కామెంట్ చేశారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ రెస్పాన్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవన్‌తో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఉగాది సందర్బంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ట్రైలర్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మ్యాజిక్ జరిగింది..
ముహూర్తం కుదిరింది..
ట్రైలర్ అదిరింది..
ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే!!https://t.co/vN5CQvQ7D2Best wishes to dear Kalyan babu, @Harish2You and the team of #UstaadBhagatSingh 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 15, 2026
READ ALSO: Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..
తాజావార్తలు
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!