Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

Usthad Bagath Sing

Usthad Bagath Sing

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, రికార్డులన్నీ తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేస్తారని అందరూ భావించగా, మేకర్స్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు.

Also Read : Vrushakarma: హాలీవుడ్ రేంజ్‌లో ‘వృషకర్మ’ గ్లింప్స్..అదిరిపోయిన నాగచైతన్య మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్

ఒక వారం ముందుగానే అంటే మార్చి 19, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివర్లో వచ్చే ఉగాది పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్, త్వరలోనే ట్రైలర్ అప్‌డేట్ కూడా ఇవ్వబోతున్నారు.