Site icon NTV Telugu

Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?

Ustad Bagath Singh

Ustad Bagath Singh

ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవర్ స్టార్ అభిమానులు, ట్రేడ్ వర్గాలు నష్టాల గురించి మాట్లాడుకునేలా చేసిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. భారీ అంచనాల మధ్య వచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో పవన్ ఫ్లాప్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది ఉస్తాద్. మార్చి 19న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దాదాపు 140 కోట్ల షేర్, 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ, కనీసం వంద కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది.

Also Read : Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’

ఇప్పటి వరకు ఇండియాలో 71 కోట్ల రూపాయల నెట్.. 83 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. మొత్తంగా ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి వరల్డ్ వైడ్‌గా 95 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో.. విడుదలైన అన్ని ఏరియాల్లోను దాదాపుగా నష్టాలు మిగిల్చింది ఉస్తాద్. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. దీంతో.. ఈ మూవీ నిర్మాతలకు దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా మేకర్స్ కొంత మేరకు సేఫ్ జోన్‌లోకి వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్.

Exit mobile version