Twitter: ‘గుడ్ బై ట్విట్టర్’.. మూసివేస్తున్నారంటూ నెట్టింట హల్‌చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ హస్తగతమైన మరుక్షణం నుంచే ఎలాన్ మస్క్ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టడంతో యూజర్ల నుంచి ఉద్యోగుల వరకు అందరిలో అనిశ్చితి నెలకొంది. కొంతకాలంగా ట్విట్టర్ సంస్థలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయాందోళనలో నెట్టుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు.. ఇక ఏదైతే అదైందని మూకుమ్మడి రాజీనామాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కిన తర్వాత సంస్థలో సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తామన్న ప్రకటన యూజర్లను అయోమయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ ఉద్యోగులు కొందరు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఇక కోలుకోలేదని వినియోగదారులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Meet Cute: నాని సోదరి ఆంథాలజీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజాగా, ఉద్యోగులు రోజుకు 12 గంటలపాటు పనిచేయాల్సిందేనని మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ట్విట్టర్‌ను వీడుతున్నారు. ఉద్యోగాలకు సామూహికంగా రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల ఉద్యోగులు లేక ట్విట్టర్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ పరిణామాలపై మస్క్ స్పందించారు. “పోతే పోనివ్వండి… అంతకు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులు వెళ్లిపోయినా నేను ఏమాత్రం బాధపడను. మాకు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు మిగులుతారు” అని వివరణ ఇచ్చారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు మస్క్ పైవిధంగా బదులిచ్చారు. ఇక, ట్విట్టర్‌ను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో పలువురు నెటిజన్లు బాధతో స్పందిస్తున్నారు. ట్విట్టర్ ఫాలోవర్లను మిస్ అవుతామంటూ భావోద్వేగాలతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు ‘Rip Twitter’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!