AP Deputy CM Pawan Kalyan: ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.. కానీ, ఆచరణలో అనుకున్నస్థాయిలో మాత్రం ముందడుగు పడడం లేదు.. అయితే, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలుచేశారు.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణకు దిగనున్నారు.. దానిని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే ఆచరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని సూచించారు పవన్ కల్యాణ్.. మన వేడుకలు.. ఉత్సవాల్లో పర్యావరణ హిత వస్తువులను వాడడం మేలన్నారు.. వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపరుతో చేసిన కవర్లతో ఇవ్వొద్దన్నారు.. ప్రసాదాలను ప్లాస్టిర్ కవర్లల్లో కాకుండా తాటాకు బుట్టలు.. ఆకుల దొన్నెలతో వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడతాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Jagannath Rath Yatra:రథ యాత్రలో తోపులాట..ఒకరి మృతి..వందల మందికి గాయాలు
అయితే, ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరామ్.. ఈ సందర్భంగా పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.