NTV Telugu Site icon

Aloe Vera: స్కిన్ లోషన్ల ఖర్చును భారీగా తగ్గించే బ్రహ్మాస్త్రం

Aloe Vera In Skincare

Aloe Vera In Skincare

Aloe Vera: ఇంటి నుంచి అడుగు బయటకు పెడితే చాలు కలుషిత వాతావరణం. UV లేదా అతినీలలోహిత కిరణాల పడి చర్మసంబంధ వ్యాధులు ప్రభలుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఈ UV కిరణాల నుండి రక్షించడానికి మార్కెట్లో రకరకాల సన్‌స్క్రీన్‌ లోషన్లు అందుబాటులో ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులన్నీ ఖరీదైనవే. వాటికోసం ప్రజలు చాలా పెద్దమొత్తంలో డబ్బులను ఖర్చు పెడుతున్నారు. కానీ అలాంటి రసాయన ఉత్పత్తులకు బదులుగా కొన్ని సహజమైన వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. రసాయనాలు కలిగిన ఉత్పత్తులు దీర్ఘకాలంలో వాడితే చర్మాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి సందర్భాలలో, కలబంద వంటి సహజ పదార్థాలను సన్‌స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు. కలబందలో చాలా ఔషధ ప్రయోజనాలనున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మిమ్మల్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఇంట్లో లభించే అనేక ఇతర సహజ పదార్థాలను కలపడం ద్వారా కలబందను సన్‌స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు. దీని వాడకం వల్ల ఎలాంటి హాని శరీరానికి ఉండదు.

Read Also: Eggs And Paneer : ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా.. ఇలా ప్రయత్నించండి

కొన్ని చిట్కాలు..
* ఒక గిన్నెలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుని సన్‌స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా, ఈ మిశ్రమాన్ని క్యూబ్స్‌గా తయారు చేసి చర్మానికి కూడా పట్టించుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు చర్మంపై ఈ క్యూబ్‌లను అప్లై చేసుకుంటే చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
* ఒక గిన్నెలో కలబంద రసాన్ని తీసుకోండి. దీనికి ఒక చెంచా కొబ్బరి నూనె కలపండి. తర్వాత దానికి 5 చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్ వేయాలి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి చర్మానికి వాడండి. ఇది టానింగ్ నివారించడంలో సహాయపడుతుంది.

Read Also: Battery Theft: పోలీసులకే సవాల్.. ట్రాఫిక్ సిగ్నల్స్ కు అమర్చిన బ్యాటరీలే టార్గెట్

* ఒక గిన్నెలో కొంత కలబంద రసం లేదా జెల్ తీసుకోండి. వాల్‌నట్ ఆయిల్, షియా బటర్, కొబ్బరి నూనె మరియు జింక్ ఆక్సైడ్ జోడించండి. వీటిని బాగా కలపాలి. తర్వాత వాటిని సన్‌స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు. ఇది హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
* ఒక గిన్నెలో అలోవెరా జెల్‌ను బయటకు తీయండి. ఒక విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్‌ను తెరిచి లోపల నూనె వేయండి. కొంచెం సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు జింక్ ఆక్సైడ్ కూడా కలపండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి సన్‌స్క్రీన్ లాగా వాడండి. ఈ కలయిక UV కిరణాల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.