అమెరికాకు చెందిన ఓ మహిళ డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. లో దుస్తులు ధరించని కారణంగా తనను విమానం నుంచి దింపేస్తామన్నారని అన్నారు. ఇది వివక్షే.. కానీ మరొకటి కాదని మహిళ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ లిసా ఆర్చ్‌బోల్డ్ (38). బ్యాగీ జీన్స్, లూజ్ టీషర్ట్ తో లోపల బ్రా ధరించకుండానే విమానం ఎక్కారు. అయితే.. అది గమనించిన మహిళా సిబ్బంది ఆమెను తన ఎద బయటకు కనిపించనప్పటికీ కూడా.. కవర్ చేసుకోవాలని సూచించారు. డీజే అయిన ఆర్చ్‌బోల్డ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Mumbai Indians: రోహిత్ శర్మే అనుకున్నాం.. మలింగతో కూడా బయటపడ్డ విభేదాలు
అయితే.. ఈ ఘటన జనవరిలో జరగ్గా, తాజాగా లాస్ ఏంజెలెస్ లో మీడియాకు తెలిపింది బాధిత మహిళ. విమాన సిబ్బంది తనతో అలా చెప్పడం వల్ల తీవ్ర అవమానంగా అనిపించిందని వాపోయింది. తాను స్త్రీని కానని భావించి తనను లక్ష్యంగా చేసుకుని అలా మాట్లాడినట్టు తనకు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. తన వస్త్రధారణ ‘బహిర్గతం’, ‘ఆక్షేపణీయం’గా ఉందని, కాబట్టి అనుమతించబోమని డెల్టా సిబ్బంది తనకు చెప్పారని తెలిపింది. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై చర్చించేందుకు కంపెనీ ప్రెసిడెంట్ తో సమావేశం కావాలని నిర్ణయించుకుని.. బాధిత మహిళ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ఓ న్యాయవాది లేఖ రాశారు.
Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
పురుషులు ఎలాగైతే టీ షర్టులను జాకెట్లతో కవర్ చేసుకోరో.. మహిళలకు కూడా అలాంటి అవసరం లేదని న్యాయవాది వాదించారు. ఒకవేళ భద్రతాపరమైన ముప్పు ఉంటేనే ప్రయాణికులను విమానం దింపాలి. అలాంటిది ఇలా ఎందుకు దిగమంటారంటూ ఆల్రెడ్ వాదనలు వినిపించింది. రొమ్ములు యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కావని, వారు అవి కలిగి ఉండడం నేరం కాదని తెలిపారు. అయితే.. ఎట్టకేలకు బాధిత మహిళకు డెల్టా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.