Trump Tariffs: టారిఫ్ వార్‌కు బ్రేక్.. ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ఇతర దేశాలపై ఇష్టానుసారం టారిఫ్‌లు పెంచుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు భారీ దెబ్బ తగిలింది. ఇతర దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి చట్టబద్ధమైన అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల కోసం ఉన్న చట్టాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడం అధికార దుర్వినియోగమేనని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6–3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అంటే తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతి పన్నులు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది.
READ MORE: Rao Bahadur: మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
1977లో వచ్చిన ఈ చట్టం అధ్యక్షుడికి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్యాన్ని నియంత్రించే అవకాశం ఇస్తుంది. అయితే సుంకాలు విధించే హక్కు గురించి స్పష్టంగా ఎక్కడా చెప్పలేదని కోర్టు పేర్కొంది. అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ నుంచి స్పష్టమైన అనుమతి ఉండాలని న్యాయమూర్తులు తెలిపారు. అలాంటి అనుమతి చూపించలేకపోయారని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఆర్థిక విధానాలకు పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా దిగుమతులపై అధిక పన్నులు వేసి దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయాలన్న ఆయన ప్రణాళికపై ప్రభావం పడింది. అదనంగా విధించిన సుంకాలను తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. భారత్‌పై విధించిన 18శాతం టారిఫ్ కూడా అనధికారమని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో భారత్‌కు సైతం మేలు చేకూరనుంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!