NTV Telugu Site icon

Viral Video: మంచికి రోజుల్లేవంటే ఇదేనేమో.. చివరికి కన్ను పోయిందిగా..

Us Restarent

Us Restarent

Viral Video: కొంతమంది వారేదో సమాజాన్ని ఉద్దరిద్దామంటూ ఏదో చెప్పబోతుంటారు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. కొందరు ఎదుటివాళ్లు చెప్పేది తమ మంచికేనని స్వీకరిస్తారు. కొందరు తలబిరుసున్న వాళ్లు ఎదురుతిరుగుతారు. తాము చేసింది తప్పైనా కూడా వారికి కోపం కట్టలు తెంచుకుంటది. మీరు చేసేది తప్పు అని చెప్పినా నువ్వు నాకేంటి చెప్పేది అన్నట్లు తిట్టడమో, దాడులకు పాల్పడడమో చేస్తుంటారు. ఇలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. బియాంకా ప్లోమెరా అనే యువతి హ్యాబిట్ బర్గర్ గ్రిల్ రెస్టారెంట్లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. అక్కడ పనిచేస్తున్న వికలాంగుడిని కొందరు యువకులు ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. దీనిని చూసిన ఆమెకు ఒళ్లుమంబి వారు చేసేది తప్పంటు అడ్డుకోబోయింది. దీంతో మనోళ్లు రెచ్చిపోయి పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఆమె ప్రతిదాడికి దిగింది. ఈ ఘటనలో ఆమె కన్ను పోగొట్టుకుంది. ఈ తతంగం అంతా సీసీ టీవీల్లో రికార్డైంది. సమాచారం అందుకున్న పోలీసులు రెస్టారెంట్ వద్దకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సదరు వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.

Read Also: Gaza Birthday incident : బర్త్ డే వేడుకలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 17మంది సజీవదహనం