Site icon NTV Telugu

G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్‌’!

Untitled Design (3)

Untitled Design (3)

US President Joe Biden leaves for India to attend G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌ బయలుదేరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి తన ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ ప్రయాణంకు ముందు బైడెన్‌కు కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొనబోతున్నారు. బైడెన్‌ నేటి సాయంత్రం ఢిల్లీకి రానుండగా.. ఆయన వాడే కాడిలాక్ కారు, ది బీస్ట్ కూడా హస్తినకు చేరుకోనున్నాయి. ది బీస్ట్ కారును బోయింగ్ సీ 17 గ్లోబ్ మాస్టర్ 111 కార్గో విమానం తీసుకొస్తుంది. విమానం దిగిన వెంటనే బీస్ట్ కారులో బయలుదేరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బైడెన్‌ కలుస్తారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన కారుగా పేరున్న ‘ది బీస్ట్‌’ ఢిల్లీ వీధుల్లో తిరగనుంది. దీనికి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సెక్యూరిటీ ఇస్తారు.

Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జో బిడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆపై ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఇక శనివారం, ఆదివారం జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో వీరు పాల్గొంటారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు. ఈ హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బిడెన్‌తో పాటు జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి వస్తుంటడంతో.. కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేసింది.

Exit mobile version