మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం జరగబోతుందా? సుదీర్ఘ కాలం ఉద్రిక్తలు తలెత్తబోతున్నాయా? క్షిపణి, రాకెట్, డ్రోన్ దాడులతో దద్దరిల్లబోతుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
గత కొన్ని రోజులుగా ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. అన్నట్టుగానే సమయం దగ్గర పడింది. ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. తాజాగా అంతకంటే శక్తివంతమైన నౌకలు, క్షిపణులు, బాంబర్లు తరలివచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ ఇరాన్‌ను అష్ట దిగ్బంధం చేశాయి. ఏ క్షణంలోనైనా విరుచుకుపడొచ్చని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రతి హెచ్చరికలే కారణంగా చెబుతున్నాయి.
ప్రస్తుతం ఇరాన్ చుట్టూ 12 యుద్ధ నౌకలు, వందలాది యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. ఈ వారంలోనే భారీ దాడులు జరగొచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ తేదీని సూచించినట్లుగా పేర్కొన్నాయి. ఇక ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. తమ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది.
ఇది కూడా చదవండి: IAS Prasad: ఐఏఎస్ అధికారి మూడో రహస్య పెళ్లిపై వీడిన మిస్టరీ.. ఇంత ట్విస్టుందా?
అమెరికన్ వార్తా సంస్థ ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. యుఎస్-ఇరాన్ యుద్ధం ఆసన్నమైందని.. వారాల పాటు కొనసాగే పూర్తి స్థాయి సంఘర్షణగా మారవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతోందని తెలిపింది. గతేడాది జూన్‌లో జరిగిన యుద్ధం కంటే ఎక్కువ స్థాయిలో ఉండొచ్చని తన నివేదికలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు.. ఫొటోలు వైరల్
ప్రస్తుతం ఇరాన్‌లో యునైటెడ్ స్టేట్స్ మధ్యప్రాచ్యంలో తన సైనిక బలాన్ని పెంచుకుంద. రెండు విమాన వాహక నౌకలు, 12 యుద్ధనౌకలు, వందలాది యుద్ధ విమానాలు, అనేక వైమానిక రక్షణ వ్యవస్థలు మధ్యప్రాచ్యంలో మోహరించాయి. కొన్ని రోజులుగా 150 కి పైగా US సైనిక కార్గో విమానాలు మధ్యప్రాచ్యానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించాయి. 50కి పైగా యుద్ధ విమానాలు (F-35లు, F-22లు మరియు F-16లు సహా) మధ్యప్రాచ్యంలో తిరుగుతున్నాయి. ఈ యుద్ధ విమానాలన్నీ భారీ వినాశకరం చేయొచ్చని తెలుస్తోంది.
ఈ వారాంతంలో దాడి
CBS న్యూస్ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యున్నత జాతీయ భద్రతా సలహాదారుడు సమాచారం ప్రకారం.. శనివారం నాటికి అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడి చేయవచ్చని చెప్పారని తెలిసింది. అయితే దాడికి అనుమతి ఇవ్వాలా వద్దా అని ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఇక ఇరాన్ కూడా ప్రతి దాడికి దిగే ముందే మధ్యప్రాచ్యం నుంచి కొంత మంది సిబ్బందిని తాత్కాలికంగా వెనక్కి రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అణు ఒప్పందం చేసుకోవాలని గత కొద్దిరోజులుగా ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇందులో భాగంగా తొలి విడత చర్చలు ఒమన్‌లో జరిగాయి. కానీ ఫలించలేదు. దీంతో ఇటీవల రెండోసారి జెనీవా వేదికగా చర్చలు జరిగాయి. కానీ ఇరాన్ ఒప్పందానికి మొగ్గు చూపలేదు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్స్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అమెరికా నౌకలను ముంచేసి ఆయుధాలు తమ దగ్గర కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీంతో అమెరికా రగిలిపోతోంది.
