US Open 2024: నేటి నుంచే యుఎస్ ఓపెన్.. 25వ టైటిల్‌పై ‘రారాజు’ కన్ను!
- నేటి నుంచే యుఎస్ ఓపెన్
- 25వ టైటిల్‌పై జకో కన్ను
- కఠిన పరీక్ష తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic Target is 25th Grand Slam: ఈ సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘యుఎస్ ఓపెన్’ నేడు ఆరంభం కానుంది. సోమవారం (ఆగష్టు 26) నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరి దృష్టి మాత్రం సెర్బియా యోధుడు, రికార్డుల రారాజు నొవాక్ జకోవిచ్‌పైనే ఉంది. జకో డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకుంటాడా?, 25వ విజయంతో మార్గరెట్ కోర్ట్ (24)ను వెనక్కి నెడతాడా? అని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా నొవాక్ జకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ గెలిచి.. తన సుదీర్ఘ స్వర్ణ కలను సాకారం చేసుకున్నాడు. జకో ఎన్నో విజయాలు, ఘనతలు సాధించాడు. ఇక అతడిని 25వ టైటిల్ ఘనత మాత్రమే ఊరిస్తోంది. ఇది సాధించి ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సొంతం చేసుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు.
Also Read
Also Read: Amy Jackson Wedding: ఘనంగా హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి.. వెడ్డింగ్ పిక్స్ వైరల్!
యుఎస్ ఓపెన్ 2024 తొలి రౌండ్లో 138వ ర్యాంకర్ అల్బాట్ (మోల్డోవా)తో జకోవిచ్ తలపడనున్నాడు. తొలి రౌండ్లో జకోవిచ్‌కు విజయం ఖాయం అయినా.. ఆపై కఠిన పరీక్ష తప్పకవపోవచ్చు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాస్ ప్రధాన పోటీదారుడిగా ఉన్నాడు. టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) నుంచి కూడా జకోకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలానే మెద్వెదెవ్, జ్వెరెవ్ కూడా రేసులో ఉన్నారు. ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవని జకో.. ఇప్పుడు ఫామ్ మీదుండడం కలిసొచ్చే అంశం. పారిస్ ఒలింపిక్స్‌లో అల్కరాస్‌ను ఓడించడంతో జకోవిచ్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు