MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MQ-4C Triton Drone: అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ (MQ-4C Triton) క్యూబా దక్షిణ తీరంలో ఆరు గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డ్రోన్ క్యూబాకు ఇంత సమీపంలోకి రావడం, ముఖ్యంగా హవానా పరిసరాలను జల్లెడ పట్టడం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
READ ALSO: Motorola Edge 50: 1.5K pOLED డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ, టెలిఫోటో కెమెరాతో మోటో ఫోన్..
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
MQ-4C ట్రైటన్ ఎందుకంత స్పెషల్?
ఇది కేవలం డ్రోన్ మాత్రమే కాదు, ఆకాశంలో అమెరికాకు ఉన్న అత్యంత శక్తివంతమైన కన్ను. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.2,000 కోట్లు అని అంచనా. ఇది చాలా ఎత్తులో ఎగురుతూ, రోజుల తరబడి గాలిలోనే ఉండగలదు. సాంకేతికత విషయానికి వస్తే.. అత్యాధునిక రాడార్లు, హై-రిజల్యూషన్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ సెన్సార్లతో ఇది సముద్రం, భూమిపై ఉన్న ప్రతి కదలికను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్ చేయగలదు. సాధారణంగా యుద్ధ క్షేత్రాలైన పర్షియన్ గల్ఫ్, బ్లాక్ సీ ప్రాంతాల్లో కనిపించే ఈ డ్రోన్, ఇప్పుడు క్యూబా తీరమంతా స్కాన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘వెనిజులా’ ప్యాట్రన్.. క్యూబాకు డేంజర్ బెల్స్!
తాజా పరిణామాన్ని రక్షణ నిపుణులు ‘వెనిజులా ప్యాట్రన్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే MQ-4C ట్రైటన్ డ్రోన్ వెనిజులా సమీపంలో 10 గంటల పాటు నిఘా పెట్టింది. సరిగ్గా ఈ నిఘా పెట్టిన మూడు నెలల తర్వాత, అమెరికా దళాలు కారకాస్‌పై దాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నాయి. ఇప్పుడు క్యూబా విషయంలోనూ సరిగ్గా అదే జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే క్యూబాకు అందే చమురు సరఫరాను అమెరికా అడ్డుకుంది, దీంతో ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. పదేళ్ల తర్వాత మొదటిసారిగా ఒక అమెరికన్ డెలిగేషన్ హవానాకు చేరుకుంది. పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) క్యూబాలో ఆపరేషన్ కోసం రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఉద్రిక్తతల్లో లాటిన్ అమెరికా
క్యూబాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని బలహీనపరిచి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే దీనిని క్యూబా తన అంతర్గత విషయంగా భావిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే, అది మొత్తం లాటిన్ అమెరికాలోనే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్యూబా ప్రభుత్వం ఈ పరిణామాలపై మౌనంగా ఉన్నప్పటికీ, అంతర్గతంగా ప్రతిఘటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
READ ALSO: Iran Vs USA: 50 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్..
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు