Teacher illicit affair:మహిళా టీచర్లు అక్కడి మైనర్ విద్యార్థులతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం అమెరికాలో పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల్లో పిల్లల్ని దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరోకటి అమెరికాలో చోటు చేసుకుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. కొడుకు, తన మహిళా టీచర్‌తో కారులో శృంగారం చేస్తుండగా, అతని తల్లి రెడ్ హ్యాండెట్‌గా పట్టుకుంది. దీనికి ఓ మొబైల్ ట్రాకింగ్ యాప్ ఉపయోగించి కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూఎస్ఏలోని నార్త్ కరోలినాలో టీచర్, ఒక టీనేజ్ యువకుడితో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. వీరిద్దరి అక్రమ సంబంధంపై పుకార్ల నేపథ్యంలో యువకుడి తల్లికి అనుమానం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల రగ్బీ ప్రాక్టీసుకు వెళ్తానని చెప్పిన అతను అక్కడికి వెళ్లకపోవడంతో తన కొడుకు లొకేషన్ ట్రేస్ చేసేందుకు లైఫ్360 అనే ట్రాకింగ్ యాప్‌ని ఉపయోగించింది. చివరకు దీని ద్వారా తన కొడుకు, 26 ఏళ్ల హైస్కూల్ టీచర్‌తో కారులో సెక్స్ చేస్తున్నట్లు గుర్తించింది.
Read Also: Congress: ఓటమి ఫలితం.. కమల్‌నాథ్ స్థానంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా జితూ పట్వారీ..
యువకుడి తల్లిదండ్రులు లైఫ్360 అనే యాప్‌ని కొడుకు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశారు. తన కొడుకు ఉన్న లొకేషన్ చూసి, స్పోర్ట్స్ ప్రాక్టీస్ సెషన్‌కి వెళ్లలేదని గుర్తించి సదరు తల్లి, అతని జాడ కోసం వెతికింది. స్థానికంగా ఉన్న ఒక పార్కులో లొకేషన్ చూపించడంతో అక్కడికి వెళ్లే సరికి.. 18 ఏళ్ల తన కొడుకు, టీచర్‌తో కారులో అసభ్యకరమైన స్థితిలో పట్టుబడ్డారు. టీచర్‌ని గాబ్రియేలా కార్టయా న్యూఫెల్డ్‌గా గుర్తించారు. మెక్లెన్ బర్గ్ హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టీచర్‌ని అధికారులు పట్టుకున్నారు. విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఐదు నేరాలు ఆమెపై నమోదయ్యాయి. అక్టోబర్ నుంచి కార్టయా న్యూఫెల్డ్, విద్యార్థితో ఐదుసార్లు సెక్స్‌లో పాల్గొన్నారని కోర్టు అభియోగాలు నమోదు చేసింది. విద్యార్థి ఇంటితో పాటు, కారు, టీచర్ ఇళ్లలో వీరిద్దరు సెక్స్ చేసుకున్నట్లు అభియోగ పత్రాలు పేర్కొన్నాయి.
