Trump: మధ్యప్రాచ్యంలో ఉద్రికత్తలు తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు తాజాగా ముగిశాయి. అమెరికా-ఇరాన్ చర్చలు 14 గంటల పాటు జరిగాయి. జేడీవాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు కొనసాగాయి. ఇక ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనాకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు గనుక చైనా ఆయుధాలను సరఫరా చేస్తే, ఆ దేశం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆ చర్చల ఫలితంతో సంబంధం లేకుండా అంతిమ విజయం అమెరికాదేనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
READ MORE: JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్
తొలిదశ చర్చలు ముగిశాక మీడియాతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఇరాన్‌పై ఇప్పటికే సైనిక విజయం సాధించామన్నారు. చర్చల్లో ఏం జరుగుతుందనేది తనకు అవసరం లేదని.. ఎలా చూసినా గెలుపు అమెరికాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. హార్మూజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సముద్రపు గనులను (Sea Mines) అమర్చిందన్న సమాచారంతో అమెరికా తన ‘మైన్ స్వీపర్’ నౌకలను రంగంలోకి దించి క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అయితే, తమ జలాల నుంచి అమెరికా సైనిక నౌకలు ఏవీ వెళ్లలేదని ఇరాన్ దీనిని కొట్టిపారేస్తోంది.
READ MORE: Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!
ఇక.. అమెరికా నిఘా వర్గాల విశ్లేషణ ప్రకారం.. ఇరాన్ తన కూలిపోయిన వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి చైనా నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భుజంపై నుంచి ప్రయోగించే యాంటీ ఎయిర్ మిసైల్స్ (MANPADS) చైనా నుంచి ఇరాన్‌కు అందే అవకాశం ఉందని సీఎన్ఎన్ నివేదించింది. ఇటీవలే అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ (F-15E) యుద్ధ విమానం, బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లను ఇరాన్ కూల్చివేయడం సంచలనం సృష్టించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా యుద్ధ విమానాలు శత్రువుల చేతిలో కూలిపోవడం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో ఇరాన్ ఒక కొత్త ‘అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్’ వాడిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) పేర్కొనడం గమనార్హం. అది చైనాకు చెందిన ‘HQ-9B’ వంటి అత్యాధునిక మిసైల్ సిస్టమ్ కావొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
