US-Iran Talks: మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. ఎప్పుడంటే..!
- మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- ఇటీవల ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గురువారం కొత్త విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉద్దేసిస్తూ కథనాలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య కొత్త చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని అమెరికా అధికారులు తెలిపినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. దాదాపు 21 గంటల పాటు ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరిగాయి.. చివరికి చర్చలు విఫలం కావడంతో ఎవరి దారిన వారు తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చర్చలు విఫలమైతే ఈసారి ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయని ట్రంప్ ముందే హెచ్చరించారు. వార్నింగ్ ఇచ్చినట్లుగానే హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. దీంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఇదిలా ఉంటే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఈనెల 21తో ముగియనుంది. సమయం దగ్గర పడుతుండడంతో పరిస్థితులు మరోసారి టెన్షన్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువుకు ముందే మరోసారి ఇరాన్-అమెరికాతో చర్చలు జరపాలని టర్కీ, పాకిస్థాన్, ఖతార్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇరాన్-అమెరికా మధ్య దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రస్తుతం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ సమయంలోనే శాంతి ఒప్పందం చేసుకోవాలని రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Earthquake: అమెరికాలో భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!