Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ను నిషేధించాలనే డిమాండ్‌ను కమిటీ ప్రతినిధి మిచెల్ మెక్‌కాల్ ముందుకు తెచ్చారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యుఎస్ పౌరుల ఫోన్లను చైనా ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు టిక్‌టాక్‌ను ఉపయోగించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. టీనేజర్లలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టిక్ టాక్‌ను నిషేధించే చర్య.. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొస్తుందేమోనని కొందరు భావిస్తున్నారు. సాధారణంగా బిల్లు సెనేట్‌లో పాసవ్వాలంటే 60 ఓట్లు వస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది. బిల్లుపై మరింత తెలియజేసేందుకు వైట్ హౌస్ సిద్ధంగా లేదు.
Read Also: Chahat Khanna: సుకేశ్‌పై టీవీ నటి బాంబ్.. ట్రాప్ చేసి, జైలుకి పిలిపించి..
ఇదిలా ఉండగా.. టిక్‌టాక్‌పై నిషేధం అనేది రాజకీయ ప్రేరేపిత చర్య అని సెనేటర్లలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో, US అధ్యక్షుడు జో బిడెన్ ఫెడరల్ అధికారులు ప్రభుత్వం జారీ చేసిన మొబైల్ ఫోన్‌లతో సహా ఏదైనా ‘టిక్‌టాక్’ని ఉపయోగించకుండా నిషేధించే చట్టంపై సంతకం చేశారు. 25 US రాష్ట్రాలు ప్రభుత్వ పరికరాల్లో TikTok వాడకాన్ని నిషేధించాయి. అమెరికాలో విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వ కమిటీ గతంలో ‘టిక్‌టాక్’పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. యుఎస్‌లోని వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వం యాక్సెస్ చేయడం వల్ల భద్రతా సమస్యలకు దారితీయవచ్చని సూచించినందున ఈ ప్రతిపాదన కూడా వచ్చింది.
Read Also: Bankers Conclave: రైతులకు బ్యాంకర్లు సహకరించాలి
2020లో, డోనాల్డ్ ట్రంప్ USలో ‘టిక్ టాక్’ వినియోగాన్ని తగ్గించేందుకు.. వినియోగదారుల్లో కొత్త డౌన్‌లోడ్‌లను నిరోధించడానికి ప్రయత్నించారు. అయితే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పౌరులు కోర్టును ఆశ్రయించడంతో ఆ చర్యను విరమించుకోవాల్సి వచ్చింది. రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో చైనా.. రష్యా నియంత్రణలో ఉన్న అన్ని సోషల్ మీడియా యాప్‌లను నిషేధించడానికి డిసెంబర్ 2021లో చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు.