NTV Telugu Site icon

Allu Aravind: ఆయన తిడతాడేమోనని ముందే చూపించాను : అల్లు అరవింద్

New Project (17)

New Project (17)

Allu Aravind: అల్లు శిరీష్ – అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ చిత్రం రాబోతుంది. దీనికి జల్సా సినిమాలోని ‘ఊర్వశివో రాక్షసివో’ పాట లిరిక్ ను సినిమా టైటిల్ గా పెట్టారు. ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, నవంబర్ 4వ తేదీన విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

Read Also: Megastar Chiranjeevi: మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. బాస్ కమింగ్

ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. ” ఈ కథ నచ్చి తమ్మారెడ్డి భరద్వాజ నుంచి లాక్కున్నాను. అందువలన ఆయనకి ఈ సినిమా రష్ చూపించాను. ‘ఇంతమంచి కథ ఇస్తే ఇలా తీసావేమిటయ్యా’ అని ఆయన అంటాడేమోనని అనుకున్నాను. కానీ ఆ రోజున రాత్రి ఆయన కాల్ చేసి, సినిమా చాలా బాగుందని చెప్పినప్పుడు ‘హమ్మయ్య’ అనుకున్నాను. కొవిడ్ వలన ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరిగిందని అన్నారు.

Read Also: Friday Special LIVE : ఇవాళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే అతి త్వరగా మీ అప్పులన్నీ తీరిపోతాయి

ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నాము. ఈ లోగా ఈ నెల 30వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఒక ముఖ్యమైన వ్యక్తి అతిథిగా రానున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది సస్పెన్స్. ఆయన వలన ఆ ఫంక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు. మరి అల్లు అరవింద్ అంతగా ఊరించిన ఆ చీఫ్ గెస్టు ఎవరనేది చూడాలి.

Show comments