Megastar Chiranjeevi: మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. బాస్ కమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: అభిమానులకు దీపావళి గిఫ్ట్ ఇవ్వనున్నారు మెగాస్టార్. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 154సినిమా టైటిల్ ప్రకటించబోతున్నట్లు మైత్రీ మేకర్స్ వెల్లడించింది. ఈ నెల 24న మెగా154టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆ రోజు 11.07గంటలకు టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి మాస్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్‌పై ‘బాస్ వస్తున్నాడు’ అని రాయడం అంచనాలని పెంచేసింది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. హీరో రవితేజ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు.
Read Also: Kantara Movie: కాంతారాకు బ్రహ్మరథం పడుతున్న బాలీవుడ్ జనాలు
Also Read
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రాఫర్. నిరంజన్ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. అలాగే, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమాకు బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్, కె.చక్రవర్తిరెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరిమోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
This Diwali it's Gonna be a "MEGA BLAST"
💥💥💣 💣Our #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️🔥
Trust me,… Poonakalu Loading 🔥🤙
Megastar @KChiruTweets
Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/ZRZmvUoKAl— Bobby (@dirbobby) October 20, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!