Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు పాల్గొని తన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తాను పవన్ కళ్యాణ్‌కు ఎంత పెద్ద అభిమానో చెబుతూనే, హరీష్ శంకర్ తన పట్ల చూపిన ఆదరణను గుర్తు చేసుకున్నారు.
READ ALSO: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ఈవెంట్‌లో హరీష్ శంకర్ వెరైటీ పబ్లిసిటీ.. ఆ షర్ట్ వెనుక అసలు కథ ఇదే!
పవన్ కళ్యాణ్ వల్లే డైరెక్టర్‌ని అయ్యాను..
బుచ్చిబాబు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ.. “కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు స్టేట్ ర్యాంకర్ అయిన నా స్నేహితుడు కిరణ్ రాజ్, పవన్ కళ్యాణ్ గారి ‘తొలిప్రేమ’ సినిమా చూసి మైమరిచిపోయాడు. ఆ సమయంలోనే తాను వాడికంటే పెద్దవాడిని అవ్వాలని, దానికి సినిమా డైరెక్షన్ ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాను” అని వెల్లడించారు. ‘తొలిప్రేమ’లోని “మిస్ లైలా మిస్ స్టైలా” పాట తనను ఎంతగా ప్రభావితం చేసిందో వివరిస్తూ ఆ పాటను స్టేజ్ మీద పాడి వినిపించారు. పిఠాపురంలో పుట్టిన తనకు, పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకోవడం గర్వంగా ఉందని బుచ్చిబాబు అన్నారు. “ఇక్కడ ఉన్నవాళ్లందరికీ ఆ అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ, నాకు మాత్రం మా ఎమ్మెల్యే కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం ఉంది” అని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “సార్, మీరు వస్తుంటే మాకు పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తుంటారు. మీ బాడీలో 50% కళ్యాణ్ గారు ఉంటారు” అని కొనియాడారు.
ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు, ఈ ఈవెంట్‌కు రావడం గురించి చరణ్ స్పందనను పంచుకున్నారు. “నేను చరణ్ సార్‌కి చెప్పాను.. షూటింగ్ ఫాస్ట్ గా అవ్వగొట్టి ఈవెంట్‌కు వెళ్తాను అని. ఆయన వెంటనే వెళ్లమని ప్రోత్సహించారు. చిరంజీవి గారి నుంచి, కళ్యాణ్ గారి నుంచి తాను ఎంత నేర్చుకున్నానో ఈ వేదికపై చెప్పమని చరణ్ సార్ ప్రత్యేకంగా చెప్పారు” అని అన్నారు. చివరగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబో మ్యాజిక్ రిపీట్ అవ్వాలని ఆయన కోరుకున్నారు.
READ ALSO: Kerala Elections 2026: కేరళలో హ్యాట్రిక్ టార్గెట్.. పినరయి విజయన్ ‘మాస్టర్ ప్లాన్’!
