NTV Telugu Site icon

Delhi: గ్రాడ్యుయేట్‌ తండ్రి ఘాతుకం.. ఒకేసారి కవల ఆడపిల్లలు పుట్టారని హత్య

Dee

Dee

అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!

నీరజ్ సోలంకి(32).. ఓటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఉంటాడు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ చదివాడు. అతడు భార్య హర్యానాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. అయితే నీరజ్‌కి ఆడ పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. కుమారుడు కావాలని ఆశ పడ్డాడు. అయితే బాలింత ఆస్పత్రిలో ఉండగా.. శిశువులను ఢిల్లీకి తీసుకొచ్చి.. జూన్ 3న చంపేసి ఇంటి సమీపంలో పాతిపెట్టాడు. పిల్లలు అనారోగ్యంతో చనిపోయారని భార్యకు అబద్ధం చెప్పాడు. పిల్లలు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.

ఇది కూడా చదవండి: Fire Accident: ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు అనుమతితో జూన్ 5న మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మంగోల్‌పురిలోని ఎస్‌జీఎం ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు డీసీపీ గోయెల్ తెలిపారు. కొడుకు పుట్టలేదని.. ఆడ శిశువులను చంపినట్లు వెల్లడించారు. నిందితుడు నీరజ్ సోలంకిని హర్యానాలోని రోహ్‌తక్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. పూత్ కలాన్ గ్రామ సమీపంలోని తాత్కాలిక శ్మశానవాటిక ఆవరణలో శిశువుల మృతదేహాలను స్థానికులు కనుగొన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అమిత్ గోయెల్ స్పష్టం చేశారు. అనారోగ్యంతో చనిపోయారని భార్యకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి సజీవంగా తీసుకొచ్చి చంపేసినట్లు పోలీస్ అధికారి వివరించారు. సోలంకి సోదరి, సోదరుడు పరారీలో ఉన్నారని.. అతని తల్లి పక్షవాతానికి గురైందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను కూడా విచారించే అవకాశం ఉందని మరో పోలీసు అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Russia: భారతీయులను మా ఆర్మీలో ఎన్నడూ కోరుకోలేదు..

సోలంకి, అతని కుటుంబం సభ్యులంతా రాత్రంతా శిశువులకు ఆహారం ఇవ్వకపోవడం వల్లే వారు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువులపై శవపరీక్షలో ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేకపోయారు. అయితే తదుపరి విచారణ కోసం అంతర్గత అవయవాలు భద్రపరిచారు. రోహ్‌తక్‌కు చెందిన శిశువు తల్లి.. సోలంకిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 2022లో అత్తమామలతో ఆమె సంబంధం చెడిపోయింది. వరకట్నం కోసం క్రమం తప్పకుండా వేధించేవారని బాధితురాలు పోలీసులు తెలిపింది. సోలంకి, కుటుంబ సభ్యులు తనను లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని కోరారని, అందుకు నిరాకరించినట్లు పోలీసులకు తెలిపింది. పోస్టుమార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను తల్లికి అప్పగించారు. సోలంకిపై హత్యానేరం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.