ఒక్క సినిమాతో హిట్ డైరెక్టర్స్ లోకి వెళ్లిన డైరెక్టర్ బుచ్చి బాబు గురించి అందరికీ తెలుసు.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఒక్క తమిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా అదే టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది.. సినిమా హిట్ అవ్వడంతో విజయ్ సేతుపతి హైదరాబాద్ లో పర్యటించారు.. కొన్ని ఛానెల్స్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.. ఈ సందర్బంగా ఓ హోటల్ జరిగిన ఈవెంట్‌లో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు పాల్గొన్నారు..
ఆ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రావడం చూసిన డైరెక్టర్ లేచి కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. దీనిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది.. ఒక డైరెక్టర్ హీరో కాళ్లు మొక్కడం విశేషం అంటూ వార్త చక్కర్లు కొడుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాబోతుంది.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు..