Buchi Babu: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppena Director Buchi Babu Father Dies: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదకాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ నివాళులు అర్పించారు.
బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా సుక్కు పనిచేశారు. అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్. సుకుమార్ పాఠం చెప్పే తీరుకి ఆకర్షితుడై.. ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. గురువు దర్శకుడిగా మారితే.. తాను అదే బాటలో నడిచారు. ‘ఆర్య 2’ నుంచి సుక్కు వద్ద బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా వర్క్ చేశారు. ఉప్పెనతో దర్శకుడిగా మారారు.
Also Read
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
Also Read: Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!
తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్సీ 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా సంజయ్ దత్ కనిపించబోతున్నారు. మైత్రీమూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!