Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

Supreme Court

Supreme Court

Supreme Court: రూ.2,000 పైన చేసే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate) విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ నూతన ఫీజు విధానంపై స్టే ఇచ్చేందుకు స్పష్టంగా నిరాకరించింది. ఈ మేరక ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఐ వాణిజ్య లావాదేవీల ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. ఛార్జీల విధానం, ప్రాతిపదికపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కొత్త యూపీఐ ఫీజుల విధానాన్ని సెప్టెంబర్ 15 (మంగళవారం) నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంతకీ ఈ MDR అంటే ఏంటంటే..?

మనం డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు ఆ లావాదేవీ సులభంగా జరగడానికి సహకరించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ యాప్‌లకు వ్యాపారులు (మర్చంట్లు) చెల్లించే రుసుమునే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate) అంటారు. తాజా నిబంధనల ప్రకారం.. మీరు ఏ వ్యాపారికైనా రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లిస్తే, కొన్ని మినహాయింపులు మినహా, సాధారణంగా 0.4% మేర MDR వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీ కేవలం మర్చంట్ పేమెంట్ వ్యవసాయంలో మాత్రమే వర్తిస్తుందని, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సామాన్య వినియోగదారులపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. ఈ MDR ఛార్జీల భారాన్ని వినియోగదారులపై వేయకుండా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. అంతేకాకుండా, యూపీఐ యాప్ ప్రొవైడర్లు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా ఎలాంటి దాగున్న ఛార్జీలను (Hidden Charges) వసూలు చేయకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.