UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
- భారతదేశంలో యూపీఐ డిజిటల్ చెల్లింపులు సరికొత్త రికార్డు
- అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ తొలిసారిగా రూ.30 లక్షల కోట్ల మార్కు
- అక్టోబర్‌లో ప్రతిరోజూ సగటున 82.2 కోట్ల లావాదేవీలు
- రోజువారీ లావాదేవీల విలువ సగటున రూ.1,01,707 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Transactions: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చేతిలో నగదు ఉంటేనే నిత్యావసరాలు లేదా కొనుగోళ్లు సాధ్యమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వీధి చివర చిన్న టీ కొట్టు నుంచి మొదలుకొని భారీ షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి. దేశంలో సాగుతున్న ఈ భారీ డిజిటల్ విప్లవంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) మరో అరుదైన మైలురాయిని అధిగమించి ఆల్‌టైమ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు మునుపెన్నడూ లేని సరికొత్త రికార్డ్స్ ను నమోదు చేయవచ్చు. ఈ ఒక్క నెలలోనే లావాదేవీల మొత్తం విలువ తొలిసారిగా రూ. 30 లక్షల కోట్ల మార్కును అధిగమించి, ఏకంగా రూ. 31.53 లక్షల కోట్లకు చేరి సరికొత్తచరిత్ర సృష్టించింది. సంఖ్య పరంగా చూస్తే అక్టోబర్‌లోనే రికార్డు స్థాయిలో 2,547 కోట్ల లావాదేవీలు పూర్తయ్యాయి. అక్టోబర్ నెలలో ప్రతిరోజూ సగటున దాదాపు 82.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇక వీటి మొత్తం విలువ పరిశీలిస్తే.. ప్రతిరోజూ సగటున రూ. 1,01,707 కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. అంటే దేశంలో యూపీఐ ద్వారా రోజువారీగా లక్ష కోట్ల రూపాయలకు పైగా నగదు లావాదేవీలు సాగడం విశేషం.
Also Read
- Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
- IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
- SOS బటన్, Family Assist ఫీచర్లtho 'సీనియర్ సిటిజన్ల' కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
- Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా దేశవ్యాప్తంగా కొనుగోళ్లు వెల్లువెత్తడం ఈ రికార్డు స్థాయి వృద్ధికి ప్రధాన ఊతాన్నిచ్చింది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో లావాదేవీల సంఖ్య 5.8% పెరగగా.. మొత్తం విలువలో 7.4% పెరుగుదల కనిపించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే లావాదేవీల సంఖ్యలో 23%, విలువలో 16% భారీ వృద్ధి నమోదైంది. 2016లో కేవలం 21 బ్యాంకులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన యూపీఐ ప్రస్థానం, నేడు వందలాది బ్యాంకులు, విభిన్న ఫిన్‌టెక్ యాప్‌లు, కోట్లాది మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. భారత్‌లో నగదు రహిత లావాదేవీలను సామాన్యుడి చేతికి చేర్చి దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో ఇది విప్లవాత్మక పాత్ర పోషించింది.
తాజావార్తలు
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు