NTV Telugu Site icon

This Week OTT Movies: ఇక పండగే.. ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు

Ott

Ott

This Week OTT Movies: దసరా పండుగ అయిపోయింది. హడావుడి కాస్త తగ్గింది. పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త సినిమాలేమీ లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి పై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్‌లు మాత్రమే ఉన్నంతలో కాస్త చూడాలన్న ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏవైనా సినిమాలు సడన్ సర్‌ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)
నెట్‌ఫ్లిక్స్
మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 14
రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 15
స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 16
గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 18
ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్
ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – అక్టోబర్ 18
కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) – అక్టోబర్ 18
లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) – అక్టోబర్ 18
స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 18
ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) – అక్టోబర్ 18

హాట్‌స్టార్
రీతా సన్యల్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 14
1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 18
రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18

ఈటీవీ విన్‌
కలి (తెలుగు) అక్టోబరు 17

జియో సినిమా
క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) – అక్టోబర్ 18
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 19
హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 19

ఆపిల్ ప్లస్ టీవీ
స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 16

బుక్ మై షో
బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18

Read Also:SpaceX: అద్భుతం.. ‘అంతరిక్షం’ నుంచి భూమిపై సురక్షితంగా దిగిన రాకెట్

Read Also:Rahul Gandhi: హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..

Show comments