NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్

New Project (93)

New Project (93)

Game Changer : కాంబోతోనే క్రేజ్ అమాంతం పెంచేసిన మూవీ ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ చిత్రాలను పెద్దన్నగా పేర్గాంచిన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ఇది. రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషించాడు. ఐదు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న చిత్రం ఇది… అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించి, దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా చరణ్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ‘గేమ్ ఛేంజర్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు.

Read Also:Kerala: ఐఏఎస్ హిందూ-ముస్లిం వాట్సప్ గ్రూప్‌పై దుమారం.. కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే..!

‘గేమ్ ఛేంజర్’ మూవీ కి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఆమె తెలిపారు. ఇక ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు ఉపాసన. ఇలా తన భర్త సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Read Also:Pakistan: పాకిస్తాన్‌కి ‘‘జాక్‌పాట్’’ తగిలింది.. సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..

Show comments