Site icon NTV Telugu

Upasana : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో బేబీ రాబోతుందంటూ ఉపాసన పోస్ట్

New Project 2023 12 17t073301.845

New Project 2023 12 17t073301.845

Upasana : మెగా కోడలిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలు అడుగుపెట్టింది. ఎన్నో సామాజిక సేవ‌లు చేస్తూ మెగా కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా వ్యవహరిస్తుంది. అలా తన ప్రవర్తనతో మెగా హీరోస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను అదే రేంజ్‌లో మెగా కోడలు ఉపాసన కూడా సొంతం చేసుకుంది. తాను చైర్మన్ గా అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన ఇటీవల తల్లిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగిన 11ఏళ్లకు క్లీన్ కార కు జన్మనిచ్చారు. ఈ చిన్నారి జూన్ నెలలో జన్మించినప్పటికీ ఇప్పటివరకు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే పెళ్లైన 11 సంవత్సరాలకు తమ అభిమాన హీరో తండ్రి కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు. ఇక క్లీన్ కార‌ ఫేస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Read Also:Karnataka: బెలగావి దాడి బాధిత మహిళను కలవకుండా కర్ణాటక హైకోర్టు నిషేధం

ఇలాంటి క్రమంలో తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా మరో బేబీ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసుకుంది. ఏంటి ఉపాసన మరో బేబీ రాబోతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కొంపదీసి మళ్లీ తల్లి అవుతుందా అంటూ అవాక్కయ్యారు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఆమె పెద్దమ్మగా ప్రమోట్ అవుతుందట. ఉపాసనకు ఒక చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు అన్షుపాల. ఈమె మూడేళ్ల క్రితం అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఉపాస‌న చెల్లి తల్లి కాబోతుందంటూ తెలుస్తుంది. అన్షు సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.. ఇంకో బేబీ రాబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవడంతో ఉపాసన చెల్లెలకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొంత మంది మాత్రం బేబీస్ అంటూ ఉపాసన షేర్ చేశారు. ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్షుపాల సీమంతం వేడుకలు ముంబైలోనే జరిగాయని అందుకే అక్కడకు వెళ్లినట్లు తెలుస్తుంది.

Read Also:Tirumala: నేటి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం..

Exit mobile version