NTV Telugu Site icon

CM Revanth reddy: సివిల్ టాపర్ అనన్యను సన్మానించిన సీఎం

Cm

Cm

యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి.. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. శనివారం సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని.. అనన్యరెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా అనన్యకు ముఖ్యమంత్రి బోకే ఇచ్చి.. శాలువాతో సన్మానించారు.

అనన్య మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వాసి. అడ్డాకల్‌‌‌‌ మండలం పొన్నకల్‌‌‌‌ గ్రామం. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ టౌన్ లోని లక్ష్మీనగర్‌‌‌‌ కాలనీలో అనన్య తల్లిదండ్రులు స్థిరపడ్డారు. అనన్య రెడ్డి ఫస్ట్ నుంచి టెన్త్ వరకూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదివారు. ఇంటర్‌‌‌‌ ప్రారంభం నుంచే ఐఏఎస్‌‌‌‌ వైపు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్‌‌‌‌లోని నారాయణ ఐఏఎస్‌‌‌‌ అకాడమీలో చేరారు. ఇంటర్‌‌‌‌ పూర్తి అయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌‌‌‌ కాలేజీలో బీఏలో చేరారు. 2020 నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌ ప్రారంభించారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌‌‌‌ పరీక్షలకు సొంతంగానే ప్రిపేర్ అయ్యారు. సివిల్స్‌‌‌‌లో ఆప్షనల్‌‌‌‌ సబ్జెక్టుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఒక్క ఆంత్రపాలజీ కోసం మాత్రమే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కోచింగ్ తీసుకున్నారు. అనంతరం ఎలాంటి కోచింగ్‌ లేకుండా తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించింది.