UP: ఢిల్లీలో శ్రమించి తన కుటుంబాన్ని పోషించిన ఓ తండ్రికి అనుకోని ఘటన ఎదురైంది. 32 సంవత్సరాల పాటు ఇంటిని తన తొమ్మిది మంది పిల్లలను కష్టపడి పెంచిపోషించాడు. ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడికి వివాహం జరిపించాడు. అంతా సవ్యంగానే ఉందనుకునేలోపే విధి అతన్ని కాటేసింది. అతడి భార్య, తొమ్మిది మంది పిల్లలకు తల్లి అకస్మాత్తుగా తన ప్రేమికుడితో పారిపోయింది. పోతు పోతు నగలు, భూమి పత్రాలు, చిన్న కుమార్తెను తీసుకొని పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
READ MORE: Telangana Colleges Bandh: ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్..
యూపీ రాష్ట్రం బదౌన్‌లోని ఖేడా జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఓంపాల్, నీలం(52) భార్యాభర్తలు. ఈ దంపతులకు వివాహం జరిగి 32 సంవత్సరాలు అయింది. వీరికి తొమ్మిది మంది సంతానం. ఇందులో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడికి వివాహం జరిగింది. వారికి సైతం పిల్లలు ఉన్నారు. ఓంపాల్ ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య నీలం పిల్లలతో ఇంట్లోనే నివసించేది. ఇంట్లోనే ఉంటున్న ఆమెకు 32 ఏళ్ల పప్పు యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి పారిపోయారు. భర్త ఓంపాల్ తన భార్య నీలం పేరు మీద కొంత భూమిని కొనుగోలు చేశాడు. దీని ప్రస్తుత విలువ రూ. 15 నుంచి 18 లక్షలు. ఆ భూమికి సంబంధించిన పత్రాలతోపాటు రూ. 4 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 50 వేల నగదును తన వెంట తీసుకెళ్లింది భార్య నీలం.
READ MORE: Albania: అల్బేనియాలో ఏఐ సూర్యుడు.. డియెల్లా మామూలుగా లేదుగా..
కాగా.. 2025 జూన్ 22న, నీలం అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి, తాను గంగానదిలో మునిగిపోతున్నానని పిల్లలకు చెప్పింది. చిన్న కుమార్తె తండ్రికి ఫోన్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఓంపాల్ వెంటనే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి తన భార్య కోసం వెతికాడు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాస్గంజ్ జిల్లా క్యోంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహేడియాలో నీలం తన ప్రేమికుడు పప్పుతో కలిసి దాక్కున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఆగస్టు 31న పోలీసులు ఆమెను గుర్తించారు. ఓంపాల్‌కు అప్పగించారు. అప్పట్లో ఇకపై ఇలా చేయనని నీలం హామీ ఇచ్చింది. కానీ సెప్టెంబర్ 2న నీలం మళ్ళీ పప్పుతో వెళ్ళింది. దీంతో భర్త ఓంపాల్ ఫిర్యాదు మేరకు.. పప్పు, అతని సోదరుడు వీరేంద్రపై సెక్షన్ 87 BNS కింద కేసు నమోదు చేశారు. ప్రియుడితో పాటు నీలం సెప్టెంబర్ 10న పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు ఆమెను 183-BNSS కింద కోర్టులో హాజరుపరిచి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాను పప్పుతో కలిసి జీవించాలనుకుంటున్నానని ఆమె కోర్టులో స్పష్టం చేసింది. దీంతో ఆమెను పప్పుతో కలిసి జీవించడానికి కోర్టు అనుమతించింది.
