NTV Telugu Site icon

UP Police: గన్ లోడ్ చేస్తుండగా ఫైర్.. మహిళ మృతి..

Up Police

Up Police

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పాస్‌పోర్టుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అయితే, స్టేషన్ లో వెయిటింగ్ చేస్తున్న సమయంలో కొద్ది దూరంలో ఒక పోలీసు తన తుపాకీని లోడ్ చేస్తున్నాడు. ఇంతలో బుల్లెట్ పేలడంతో మహిళ తలపై తగిలింది. దీంతో ఆమె నేలకు ఒరిగింది.

Read Also: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్..

అయితే, గాయపడిన ఇష్రత్ అనే మహిళను ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నిన్న మధ్యాహ్నం 2:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పోలీసు పరారీలో ఉన్నాడు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన అధికారి డబ్బుల కోసం మహిళను వేధిస్తున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వాగ్వాదం జరగడంతో అధికారి అతడిని కాల్చిచంపినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read Also: Karthika Vanabhojanalu: నేడు కాపు, రేపు శెట్టిబలిజ వనభోజనాలు.. పోలీసుల ఆంక్షలు

ఇక, సదరు మహిళ ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ, పాస్ట్ పోర్ట్ కొసం ఆమె అప్లైయ్ చేయగా.. పోలీసులు డబ్బు కోసం తరచూ వేధించడంతో నేరుగా పోలీస్ స్టేసన్ కి వచ్చి వారికి డబ్బులు చెల్లించేందుకు రెడీ అయింది. ఇదే సమయంలో లోపలికి వచ్చిన పోలీసు తన సహచర ఆఫీసర్ కు తుపాకీని అందజేశాడు. ఒక బుల్లెట్ పేలినప్పుడు.. మహిళ నేలపై పడినప్పుడు పోలీసు తుపాకీని పరీక్షించడం కనిపిస్తుంది. అయితే, దీనిపై అలీగఢ్ ఎస్ఎస్పీ కళానిధి నైతాని మాట్లాడుతూ.. ఇన్‌స్పెక్టర్ మనోజ్ శర్మ నిర్లక్ష్యం కారణంగా తక్షణమే సస్పెండ్ చేశామని చెప్పారు. ఎస్ఐ పై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఎస్ఎస్పీ తెలిపారు. ఈ ఘటన పూర్తిగా అక్కడి పోలీస్ స్టేషన్ లో రికార్డు అయింది. దీనిపై విచారణ జరిపేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ కళానిధి నైతాని చెప్పారు.