Site icon NTV Telugu

Uttar Pradesh: చదివించి లెక్చరర్ చేసిన భర్త.. కాళ్లు విరగ్గొట్టిన భార్య

Up

Up

చదివించి లెక్చరర్ చేస్తే.. కాళ్లను విరగ్గొట్టించింది ఓ భార్య. తనకు చదువు రాకుండా.. తన భార్య చదువుకుంటానంటే కష్టపడి చదివిస్తే.. చివరకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలో జరిగింది. తాను చదువుకునేందుకు మద్ధతిచ్చానని.. కానీ తన భార్య దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు భర్త. తాను నిరక్షరాస్యుడని, అయినా తన భార్య చదువుకు అడ్డం పెట్టకుండా ఆర్థికంగా ఆదుకుంటూనే ఉన్నానని భర్త చెబుతున్నాడు. తన భార్యను బీఏ, ఎంఏ, ఎంఈడీ, ఎంఫిల్ వరకు చదివించినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కానీ, ఉద్యోగం తర్వాత ఆమె స్వభావం మారిపోయిందని.. అతనిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పిల్లలతో కూడా దురుసుగా ప్రవర్తిస్తోందని భర్త తెలిపాడు.

Eesha Rebba : స్పైసి లుక్ తో అదరగొడుతున్న డస్కీ బ్యూటీ..

వివరాల్లోకి వెళ్తే.. కమతా ప్రసాద్ అనే వ్యక్తి తన భార్యను మేనల్లుడికి భోజనం పెట్టావా అని అడగడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తులైన ప్రసాద్ భార్య, ఆమె సోదరులు.. అతడిపై దాడి చేశారు. అతడి కాళ్లు విరగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తుండగా.. తాము ఎవరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని వారు పేర్కొన్నారు. అయితే అధికారికంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Exit mobile version