Site icon NTV Telugu

Bundles of Notes Found At Begger: బాబోయ్‌ నోట్ల కట్టలు.. బిచ్చగాడి వద్ద డబ్బులే డబ్బులు

Beggar

Beggar

Bundles of Notes Found At Begger:
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని
అంది మనీ మనీ
పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా
తానే అంది మనీ మనీ.. ఇది మనీ చిత్రంలో చక్రవర్తి పాడే పాట. ఇప్పుడిది ఎందుకు అనుకుంటున్నారా.. అతనో బిచ్చగాడు రోడ్లపై అడుక్కుంటూ జీవిస్తున్నాడు. సడన్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన జేబుల్లో ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని తనిఖీ చేశారు స్థానికులు. కానీ వారు అతడి జేబులు వెతికి షాక్ తిన్నారు. అతడి జేబుల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అన్నీ రూ.2 వేల నోట్లే.. అది చూసి నోరు వెళ్లబెట్టడం ప్రజల వంతయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌లో జరిగింది.

Read Also: Cylinder Blast: పెళ్లిలో పేలిన సిలిండర్.. 32మంది మృతి

షరీఫ్‌ బౌన్క్‌ అనే 50 ఏండ్ల వ్యక్తి గోరఖ్‌పూర్‌ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఆయనకు చెవులు వినపడవు. రోజూలానే శనివారం వీధుల్లో తిరుగుతుండగా అతడిని ఓ బైక్‌ ఢీకొట్టింది. దీంతో కాలు విరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అతని వద్ద గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబుల్లో వెతికారు. అయితే ఐడీ కార్డులు కాదుకానీ.. వారికి రూ.2 వేల నోట్ల కట్టలు దొరికాయి. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అన్నీ లెక్కబెట్టి చూస్తే రూ.3 లక్షల 64 వేలు ఉన్నాయి. మొత్తం రూ.2 వేల నోట్లేనని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీకి తరలించామని, కాలు విరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ డబ్బు తమ వద్దే ఉన్నదని తెలిపారు. ఏ పుట్టలో ఏపాముందో అన్న సామెత ప్రకారం ఇక నుంచి ఏ జేబులో ఎన్ని నోట్ల కట్టలున్నాయనుకోవాలేమో..?

Exit mobile version