Bundles of Notes Found At Begger: బాబోయ్ నోట్ల కట్టలు.. బిచ్చగాడి వద్ద డబ్బులే డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bundles of Notes Found At Begger:
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని
అంది మనీ మనీ
పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా
తానే అంది మనీ మనీ.. ఇది మనీ చిత్రంలో చక్రవర్తి పాడే పాట. ఇప్పుడిది ఎందుకు అనుకుంటున్నారా.. అతనో బిచ్చగాడు రోడ్లపై అడుక్కుంటూ జీవిస్తున్నాడు. సడన్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన జేబుల్లో ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని తనిఖీ చేశారు స్థానికులు. కానీ వారు అతడి జేబులు వెతికి షాక్ తిన్నారు. అతడి జేబుల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అన్నీ రూ.2 వేల నోట్లే.. అది చూసి నోరు వెళ్లబెట్టడం ప్రజల వంతయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌లో జరిగింది.
Read Also: Cylinder Blast: పెళ్లిలో పేలిన సిలిండర్.. 32మంది మృతి
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
షరీఫ్ బౌన్క్ అనే 50 ఏండ్ల వ్యక్తి గోరఖ్‌పూర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఆయనకు చెవులు వినపడవు. రోజూలానే శనివారం వీధుల్లో తిరుగుతుండగా అతడిని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో కాలు విరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అతని వద్ద గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబుల్లో వెతికారు. అయితే ఐడీ కార్డులు కాదుకానీ.. వారికి రూ.2 వేల నోట్ల కట్టలు దొరికాయి. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అన్నీ లెక్కబెట్టి చూస్తే రూ.3 లక్షల 64 వేలు ఉన్నాయి. మొత్తం రూ.2 వేల నోట్లేనని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని బీఆర్డీ మెడికల్ కాలేజీకి తరలించామని, కాలు విరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ డబ్బు తమ వద్దే ఉన్నదని తెలిపారు. ఏ పుట్టలో ఏపాముందో అన్న సామెత ప్రకారం ఇక నుంచి ఏ జేబులో ఎన్ని నోట్ల కట్టలున్నాయనుకోవాలేమో..?
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!