UP Encounters: ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ఎన్‌కౌంటర్లకు చిరునామాగా మారుతోంది. పేరు మోసిన నేరస్థులను మట్టుపెట్టడంలో యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న “జీరో టాలరెన్స్” విధానం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 15,726 ఎన్‌కౌంటర్లు చేశారు. 256 మంది పేరుమోసిన నేరస్థులను హతమార్చారు. ఈ చర్యల వల్ల నేరస్థులు రాష్ట్రం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. సీఎం యోగి మిషన్ శక్తి 5.0 కూడా నేరస్థులపై కఠినమైన చర్యలను ముమ్మరం చేస్తోంది.
READ MORE: HCA: హెచ్‌సీఏలో మరో వివాదం.. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
యూపీ పోలీసుల కథనం ప్రకారం.. గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో యోగి ప్రభుత్వ పోలీసు దళం 256 మంది పేరుమోసిన నేరస్థులను ఎన్‌కౌంటర్లలో చంపింది. ఉత్తరప్రదేశ్ అంతటా ఎన్‌కౌంటర్లు జరిగాయి. జీరో-టాలరెన్స్ విధానం కింద ఈ చర్య తీసుకున్నారు. ఈ కాలంలో 31,960 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 10,324 మంది గాయపడ్డారు. నేరస్థులను నిర్మూలించడంలో మీరట్ జోన్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జోన్‌లో 4,453 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో 85 మంది పేరుమోసిన నేరస్థులు మరణించారు. ఇక్కడ 8,312 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 3,131 మంది గాయపడ్డారు. ఇదే మీరట్ జోన్‌లో 461 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. ఇద్దరు అమరులయ్యారు.
ఎన్‌కౌంటర్లలో వారణాసి జోన్ రెండవ స్థానంలో, ఆగ్రా జోన్ మూడవ స్థానంలో ఉంది. వారణాసి జోన్‌లో 1,108 ఎన్‌కౌంటర్లల్లో 27 మంది నేరస్థులు మరణించగా, 2,128 మందిని అరెస్టు చేశారు. ఆగ్రా జోన్‌లో 2,374 ఎన్‌కౌంటర్ల ఫలితంగా 22 మంది నేరస్థులు మరణించగా, 5,631 మంది నేరస్థులు అరెస్టు చేశారు. ఈ మూడు జోన్‌లలో అనేక మంది నేరస్థులు రాష్ట్రం విడిచి వెళ్ళవలసి వచ్చింది. మరోవైపు.. రాష్ట్రం అంతటా జరిగిన ఎన్‌కౌంటర్లలో నేరస్థులతో పోరాడుతూ 18 మంది పోలీసులు అమరులయ్యారు. 1,754 మంది గాయపడ్డారు.
READ MORE: BaahubaliTheEpic : ‘బాహుబలి ది ఎపిక్’ దారిలో పుష్ప, KGF, పొన్నియన్ సెల్వన్
