UP CM Yogi Adityanath Deepfake Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘డీప్‌ఫేక్ వీడియోస్’ సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు డీప్‌ఫేక్ వీడియోస్ బారిన పడ్డారు. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టిస్తున్న ఈ వీడియోలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టినా.. ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
డయాబెటిస్ ఔషధానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నట్లు వీడియోలో ఉంది. మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ సీఎం ప్రోత్సహిస్తున్నట్లు కేటుగాళ్లు 41 సెకన్ల నిడివి గల వీడియోను సృష్టించారు. ఓ న్యూస్ ఛానల్ క్లిప్‌లో యోగి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఫిబ్రవరి 26న ఈ వీడియో అప్‌లోడ్ చేయబడింది. హజ్రత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
Also Read: Aishwarya Addala: పెళ్లి చేసుకుని మోసం చేసిందని.. మీడియాను ఆశ్రయించిన ప్రముఖ సీరియల్ నటి భర్త!
రష్మిక మందన్న, అలియా భట్, కృతి సనన్, కాజోల్, కత్రినా కైఫ్, సారా టెండూల్కర్.. డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియోలు కూడా ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.