వాతావరణ మార్పుల వలన తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అకాల వర్షాలు కురిసాయి. ఈ అకాలవర్షాల వలన రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో పంట నష్టం సంభవించినట్లు తెలుస్తున్నది. వచ్చే రెండు మూడు రోజులు కూడా ఆకాలవర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలియజేయడమైనది. కావున రైతులందరు వచ్చే రెండు మూడు రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మంత్రి వర్యులు కోరడమైనది అదే విధంగా వ్యవసాయ ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వవల్సిందిగా ఆదేశించడమైనదని తెలియజేసారు. ముఖ్యముగా మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యము గానీ, మిర్చి గానీ, మరే ఇతర పంట కానీ దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా కల్లాల్లో గానీ, ఇతర ప్రాంతాలలో ఆరబోసిన ధాన్యము గానీ, ఇతర పంటలు గానీ, దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వవల్సిందిగా అధికారులను ఆదేశించారు.
PM Modi: ‘హిందూ మతాన్ని అవమానిస్తోంది’.. రాహుల్ గాంధీ “శక్తి” వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
ఆదిలాబాద్ జిల్లా లో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్, గుడిహత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్ హత్నూర్, తలమడుగు మండలాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల గాలులతో కూడిన వాన కురియడంతో పంటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. బజార్ హత్నూర్ 29.5 మీ మీ వర్షపాతం నమోదు కాగా.. తలమడుగులో 20.8 మీ.మీ. గుడి హత్నూర్ లో 19.3మీమీ, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ దరి లో 18.3 మీమీగా వర్షపాతం నమోదైంది. బజార్ హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామంలో జొన్న పంట నేలకొరిగింది.