NTV Telugu Site icon

Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో రాహుల్ హత్య కేసు.. ప్రేమ వ్యవహరమే కారణమా?

Rahul Singh Murder

Rahul Singh Murder

Rajendra Nagar: నగరంలోని రాజేంద్రనగర్‌లో రాహుల్ సింగ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలోని ధూల్ పేటకు చెందిన రాహుల్ సింగ్ మణికొండలోని అలీజాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని నివాసానికి సమీపంలోని జిమ్ నుండి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు అతని కళ్లలో పెప్పర్ స్ప్రే చెల్లి రాహుల్ సింగ్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. రాహుల్ సింగ్ తన బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహరం నడిపారు. అయితే పెళ్లి విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే రాహుల్ సింగ్ హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ సింగ్ మధ్యవర్తులను ఆశ్రయించినట్లుగా ప్రచారం సాగుతోంది.

Read also: Gabon: గాబన్‌‌ని స్వాధీనం చేసుకున్న ఆ దేశ సైన్యం.. సంక్షోభంలో ఆఫ్రికా దేశం..

రాహుల్ సింగ్ హత్యలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాహుల్ సింగ్‌ను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాహుల్‌ సింగ్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారనే దానిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అన్న వికాస్ కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నాడు. రాహుల్ కి జిమ్, ఇళ్ళు తప్పా మరొకటి తెలియదని అన్నారు. మా బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉండేదని తెలిపారు. పెళ్ళి చేసుకోకపోవడంతో నా తమ్ముడి పై పగ పెంచుకుందని తెలిపారు. వైషికా, మరో వ్యక్తి కలిసి మా తమ్ముడిని చంపారని అన్నారు. మొత్తం నలుగురు జిమ్ దగ్గరికి వచ్చి కత్తితో పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్వాన్ కు చెందిన అజహర్ కు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడని తెలిపాడు. ఆ డబ్బులు ఇవ్వాల్సి ఉందని, ఉదయం అజహర్, రాహుల్ కి ఫోన్ చేసి మాట్లాడాడని తెలిపారు. ఆ తరువాతే రాహుల్ హత్య జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. నా తమ్ముడు రాహుల్ ని చంపిన నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారని అన్నారు. వైషికా ఆమె తల్లి ఇద్దరు కూడా కనిపించడం లేదని వెల్లడించారు. మరి వైషికా.. రాహుల్ ను ప్రేమించి ఉంటే తననే ఎందుకు చంపాలని అనుకుంది? రాహుల్ వేరే అమ్మాతో ప్రేమ వ్యవహారం నడిపాడా? అది నచ్చకనే వైషికా నే ప్లాన్ ప్రకారం.. రాహుల్ ను చంపేసి పరార్ అయ్యాందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gabon: గాబన్‌‌ని స్వాధీనం చేసుకున్న ఆ దేశ సైన్యం.. సంక్షోభంలో ఆఫ్రికా దేశం..