NTV Telugu Site icon

Kissing New York Council Member : వీడెవడ్రా బాబు.. న్యూయార్క్ కౌన్సిల్ సభ్యురాలికి లైవ్ లో ముద్దుపెట్టాడు

Kiss

Kiss

Kissing New York Council Member : ఓ అపరిచిత వ్యక్తి సడెన్ గా వచ్చి మనకు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చిరాకుగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అయితే ఇది జరిగింది సామాన్యులకు కాదు. ఏకంగా ఓ ప్రజాప్రతినిధికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూయార్క్ కౌన్సిల్ వుమెన్ ఇన్నా వెర్నికోవ్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. న్యూయార్క్ సిటీ 48వ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇన్నా వెర్నికోవ్‌ బ్రూక్లిన్‌లోని బ్రైటన్ బీచ్ లో ఇంటర్య్వూ లో మాట్లాడుతున్నారు. సీబీఎస్ న్యూయార్క్ రిపోర్టర్ హన్నా క్లిగెర్‌ ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. స్థానిక విషయాలపై వెర్నికోవ్‌ మాట్లాడుతుండగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది.అనుకోకుండా అటునుంచి నడుచుకుంటూ వెళుతున్న ఓ అపరిచితుడు వచ్చి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. అనంతరం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ అనుకోని ఘటనతో వెర్నికోవ్‌ షాక్ కు గురయ్యింది. వెంటనే తలను పక్కకు తిప్పేసుకుంది. అనంతరం అతడిని చూస్తూ పెద్దగా తిట్టింది వెర్నికోవ్‌.

Also Read: Cat sentiment : దొంగలను పట్టించిన పిల్లి.. స్టోరీ తెలిస్తే నవ్వాపుకోలేరు

ఈ ఘటన గురువారం జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వెర్నికోవ్‌ స్పందిస్తూ తానేమి సొసైటి నుంచి ప్రేమను ఆశించడం లేదన్నారు. ఇది ఒక అసహ్యకరమైన ఘటన అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో పలువురు వెర్నికోవ్‌ కు మద్దతుగా నిలుస్తున్నారు. సహచర సిటీ కౌన్సిల్ సభ్యుడు లిన్ షుల్మాన్ ఈ ఘటనను ఖండించారు. వెర్నికోవ్ కు ఈ విషయంలో తన మద్దతును ప్రకటించారు. 2023 లో ఓ మహిళకు ఇష్టం లేకుండా ఇలా జరగడం బాధాకరమన్నారు. నెటిజన్లు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నారు. మహిళపై ఇలా జరగడం సరికాదన్నారు. వెంటనే దుండగుడిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఇదిలా వుండగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేరం జరిగిన వెంటనే రియాక్ట్ పోలీసులు దీనిపై స్పందిచలేదు. ఈ ఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. పోలీసుల తీరు మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది.