Hyderabad Crime: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
Read Also: Bird Flu : నాగపూర్లో బర్డ్ ఫ్లూ బీభత్సం.. చనిపోతున్న వేలాది కోళ్లు
మీ ఇంటిని దెయ్యం ఆవహించిందని ఓ మహిళను నమ్మించారు కొందరు దుండగులు. పూజల పేరుతో లక్షకు పైగా వసూలు చేశారు. ఇంట్లో ఉన్న బంగారం అంతా పూజలో ఉంచాలని కేటుగాళ్లు చెప్పారు. ఆ మహిళ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి పూజలో పెట్టగా.. ఒరిజినల్ బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి ఉడాయించారు కేటుగాళ్లు. నకిలీ బంగారం మూటలో నిమ్మకాయలు, టమాటా, ఎండు మిరపకాయలు పెట్టారు. . మూటను తాము చెప్పేవరకు విప్పొద్ధని.. ఇంట్లో మూలన పెట్టాలని దుండగులు చెప్పారు. అనుమానం వచ్చిన మహిళ మూట తెరిచి చూడగా.. అందులో నకిలీ బంగారం ఉండడంతో అవాక్కయింది. ఆమె నమ్మించి 10 తులాల బంగారం.. లక్ష నగదుతో ఉడాయించారు దుండగులు. ఫిలింనగర్ పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.