NTV Telugu Site icon

United World Wrestling: భారత రెజ్లర్లకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మద్ధతు

Reglors

Reglors

ఇప్పుడు దేశ వ్యాప్తంగా రెజ్లర్ల నిరసనపై పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి. నెల రోజులుగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకూ ఢిల్లీకే పరిమితమైన వారి అంశంపై.. ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీకి… యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మీకు మేమున్నమంటూ అండగా నిలబడుతోంది.

Read Also: Lady constable: ప్రయాణికురాలు ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్..

బ్రిజ్ భూష‌ణ్‌పై ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ గోడును పట్టించుకునే వారే కరువయ్యారంటూ.. చివరకు వాళ్లు కష్టపడి సాధించిన పథకాలను కూడా గంగా నదిలో వేసేందుకు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆమరణ నిరాహార దీక్షకూ సిద్ధమయ్యారు. పథకాలు గంగలో కలిపేందుకు హరిద్వార్ కూడా వెళ్లారు. అక్కడ గంగానదిలో పతకాలను కలవబోతుండగా.. రైతు సంఘం నేతలు వచ్చి వారికి హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేస్తామంటూ వారు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు తమ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు వాయిదా వేశారు రెజ్లర్లు. ఈ పరిణామాలన్నీ గమనించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను హెచ్చరించింది.

Read Also: Fresh Mutton: మీరు కొంటున్న మటన్‌ తాజాదేనా.?

పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. అంతేకాకుండా బ్రిజ్ భూష‌ణ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తేల్చేందుకు చేప‌ట్టిన ద‌ర్యాప్తు క‌మిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. 45 రోజుల్లోగా రెజ్లింగ్ స‌మాఖ్యకు ఎన్నిక‌లు నిర్వహించ‌కుంటే.. ఆ ఫెడరేష‌న్‌ను స‌స్పెండ్ చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జ‌ర‌గాల్సిన ఆసియా చాంపియ‌న్‌షిప్‌ను మ‌రో చోటుకు త‌ర‌లించే నిర్ణయం తీసుకున్నట్లు UWW ప్రకటించింది. ఇప్పటికైనా స్పందించకపోతే మున్ముందు భారీ మూల్యం తప్పదనేది UWW స్టేట్మెంట్ సారాంశం. మరీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ బాడీ ఎంట్రీతోనైనా రెజ్లర్ల వివాదానికి పరిష్కారం దొరుకుతుందా.. లేదంటే రెజ్లర్ల నిరసనలు ఇలానే కంటిన్యూ అవుతాయనేది చూడాల్సిందే.