Site icon NTV Telugu

Rajnath Singh AP Tour: నేడు ఏపీలో రాజ్‌నాథ్ సింగ్‌ పర్యటన

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh AP Tour: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరులో పలు కార్యక్రమాలు పాల్గొననున్నారు రాజ్‌నాథ్.. మొదట విశాఖ చేరుకోనున్న ఆయన.. భారత్ రైజింగ్ పేరుతో జరగనున్న మేధావులతో సమావేశంలో పాల్గొంటారు.. ఈ సమావేశానికి సుమారు 600 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది బీజేపీ.. ఇక, విశాఖ తర్వాత విజయవాడలో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు రాజ్‌నాథ్‌.. ఆ తర్వాత ఏలూరు వెళ్లనున్న రాజ్‌నాథ్ సింగ్‌.. బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు. అయితే, ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.. అయితే, రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనతో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.

ఇక, రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ఇలా ఉంది..

* ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న కేంద్రమంత్రి రాజనాథ్‌ సింగ్

* విశాఖ, విజయవాడ, ఏలూరులో పర్యటించనున్న రాజనాథ్‌ సింగ్

* విశాఖలో VUDA చిల్డ్రన్స్ థియేటర్ లో 12 గంటలకు మేధావుల సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రి.

* మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడ చేరుకోనున్న రాజనాథ్‌

* విజయవాడలో ఒక హోటల్లో బీజేపీ ఏపీ లోక్‌సభ స్ధానాల కోర్ కమిటీతో సమావేశం

* సాయంత్రం 5:10 కి ఏలూరు ఇండోర్ స్టేడియానికి చేరుకోనున్న రాజనాథ్‌ సింగ్

* ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్న రాజనాథ్‌

* సాయంత్రం 7:10 కి ఏలూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్‌నాథ్..

* 7.10 తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్న రాజ్‌నాథ్‌ సింగ్‌.

Exit mobile version