NTV Telugu Site icon

AP Elections 2024: చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ.. ఏం చేద్దాం..?

Babu

Babu

AP Elections 2024: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. ఇప్పటికే పలుమార్లు బీజేపీ కేంద్ర పెద్దలు చంద్రబాబుతో సమావేశమై.. సీట్ల సర్దుబాటు, ప్రచారంపై చర్చించారు.. ఇక, ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. మరికొందరు బీజేపీ పెద్దలు సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తావన వచ్చిందట.. ఇక, పెన్షన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ కి వివరించారు చంద్రబాబు నాయుడు.. మరోవైపు వచ్చే (మే నెల) నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై కూడా చర్చించారట.. చంద్రబాబుతో భేటీ అయిన వాళ్లల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ సంయుక్త కార్యదర్శి శివ్ ప్రకాష్ తదితర నేతలు ఉన్నారు. కాగా, ఇప్పటికే బీజేపీ-టీడీపీ-జనసేన నేతలు ఉమ్మడిగా ప్రచారం చేస్తూ.. కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తోన్న విషయం విదితమే.