Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కాకరేపుతోన్న విషయం విదితమే కాగా.. ఈ సారి టీడీపీ-జనసేనతో కలిసి జట్టుకట్టి బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. ఇక, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నేడు ఏపీకి రానున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ.. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు నాగ్‌పూర్ నుంచి గడ్కరీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇక, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి అరకు పార్లమెంటు పరిధిలోని సుందరనారాయణపురంకు ప్రత్యే హెలికాఫ్టర్ లో వెళ్తారు.. ఉదయం 11:30 గంటలకు అరుకు లోక్‌సభ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఇక, మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి విశాఖకు హెలికాఫ్టర్ లో చేరుకోనున్న ఆయన.. విశాఖలోని ITC హోటెల్ డీవీ గ్రాండ్ బీ లో విశ్రాంతి తీసుకోనున్నారు.. ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఇక, సాయంత్రం 6:15 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి నాగపూర్ వెళ్లనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మరోవైపు.. నితిన్ గడ్కరీ సభలను విజయవంతం చేసేందుకు బీజేపీతో పాటు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు కూడా తమ పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Earthquake: లాస్ ఏంజిల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు