Site icon NTV Telugu

Kisan Reddy: నవంబర్ 14 బాలల దినోత్సవం మార్చాలి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Kishanreddy

Kishanreddy

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారతీయ సాహసయోధులైన సాహిబ్‌జాదా జొరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతే సింగ్‌లకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1500 ఏండ్ల క్రితం భారతీయత కోసం, ధర్మం కోసం పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానమయ్యారని తెలిపారు. డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్‌గా గుర్తించడం వారి త్యాగానికి, ధైర్యానికి ఘన నివాళి అని అన్నారు.

Read Also: Ram Charan : గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ సేల్స్ సూపర్

భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఆ వీరపుత్రులకు ఘన నివాళులర్పిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వారిద్దరు సిక్కుల పథానికి, ధర్మానికి అంకితమై తమ ప్రాణాలను అర్పించి చిన్న వయసులోనే అమరులైన వీరులు అని కొనియాడారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం.. అదేవిధంగా డిసెంబరు 26న వీర్ బాల్ దివస్ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ప్రధానమంత్రి మోడీ వీర్ బాల్ దివస్‌ను యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు.

Read Also: NALCO Recruitment 2024: నాల్కోలో 518 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇలా

డిసెంబరు 2022లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాలు మొదటి సారిగా నిర్వహించబడ్డాయని కేంద్రమంత్రి తెలిపారు. సాహిబ్‌జాదా జోరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతే సింగ్‌ల ధైర్యం, త్యాగాలకు నివాళి అర్పించడం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం.. ఆ రోజుకు బాలల దినోత్సవం జరుపుకోవడానికి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. మార్చాల్సిన అవసరం ఉంది.. డిసెంబర్ 26 చిల్డ్రన్ డే జరుపుకోవడానికి సరైన రోజని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version