Kishan Reddy: వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్ రెడ్డి పూజలు చేశారు. వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ అనంతరం శివునికి మందిరాన్ని అంకితం చేసిన సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఏఎస్‌ఐ అధికారులకు చాలా పరిమితులున్నాయని. ఆ పరిమితుల్లోనే వాళ్లు పనిచేస్తారని, వీటి కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనన్నారు. దేశ చరిత్రలో కాకతీయుల పాలనాకాలం స్వర్ణయుగం లాంటిదన్నారు. వ్యవసాయం మొదలుకుని.. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇవాళ్టికి కూడా రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు. అలాంటి కాకతీయుల కళావైభవానికి ఇవాళ భక్తులకు అంకితమైనటువంటి ఈ వేయి స్తంభాల మండపం ఓ మచ్చుతునక అని అన్నారు.
Read Also: CM Revanth Reddy: ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మహాశివరాత్రి, ఉమెన్స్ డే శుభాకాంక్షలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1163లో కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు ఈ ఆర్కిటెక్చురల్ మార్వెల్ (ఇంజనీరింగ్ అద్భుతం)ను నిర్మించారు. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72 ఏళ్లు పట్టిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.1324-25లో తుగ్లక్ సైన్యం చేసిన దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైంది. దీంతోపాటుగా ఈ మందిరంలో ఉన్నటువంటి.. సూర్య, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లింది.మధ్యయుగ కాలంనాటి ఈ గుడి.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడున్న మండపంలో గ్రామసభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. 132 స్తంభాలున్న కల్యాణ మండపం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు 2006లొ దీన్ని కూల్చేశారు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాను. అప్పుడు ఈ పరిస్థితి విని బాధ కలిగింది. దీంతో ప్రత్యేక దృష్టి సారించాను. ఆ తర్వాత వివిధ కారణాలతో.. పిల్లర్లు ఊగిసలాడుతూ ఉన్న ఈ వెయ్యిస్తంభాల గుడి.. 40 ఏళ్ల క్రితం పూర్తిగా శిథిలమైంది. ఆ తర్వాత 2006 నుంచి దీన్ని పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనా.. అది నత్త నడకన సాగింది. వాస్తవానికి.. వెయ్యిస్తంభాల మండపం పునరుద్ధరణ ఓ చాలెంజింగ్ టాస్క్ గా మారింది.” అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Kedarnath Temple: బిస్కెట్స్ తో కేదార్‌నాథ్ ఆలయం.. అద్భుతమే..
మోడీ పగ్గాలు చేపట్టాక ఏఎస్‌ఐకి నిధులు రావడంతో పనులు వేగంగా జరిగాయన్నారు. 2021 సెప్టెంబర్ తర్వాత ఈ పనులు మరింత వేగవంతమయ్యాయన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలయ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న కళాకారులను (స్థపతులు) తీసుకురావడం, వారి సహాయంతో.. డాక్యుమెంటేషన్ ఆధారంగా ఈ వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైందన్నారు. వాళ్లందరికీ మనమంతా రుణపడి ఉండాలన్నారునంది విగ్రహం జీవం పోసుకున్నట్లుగా లైవ్ లీగా ఉందన్నారు. స్థపతులు అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఈ మహత్కార్యంలో భాగస్వాములై పనిచేశారని కిషన్ రెడ్డి ప్రశంసించారు.
ధ్వంసమైన పిల్లర్ల స్థానంలో.. బ్లాక్ గ్రానైట్ తో అచ్చం పాతవాటిలా ఉండే స్తంభాలను వీరు తయారుచేశారన్నారు.
పని దాదాపుగా పూర్తయింది.. మిగిలిన చిన్నాచితకా పనులను కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఇవాళ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు అంకితం చేయాలనే ఉద్దేశంతో.. ఇవాళ కార్యక్రమం పెట్టుకున్నామన్నారు. మహాశివుని ఆశీస్సులతో భారతదేశం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. మోడీ నాయకత్వంలో.. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు.. శివుని ఆశీస్సులు మనపై ఉంటాయనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో.. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రొఫెసర్ పాండురంగారావు, ASI అధికారులు పాల్గొన్నారు.