NTV Telugu Site icon

Kishan Reddy: సమ్మక్క-సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించిన కేంద్ర మంత్రి

Tribal University

Tribal University

Kishan Reddy: ములుగులో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్‌లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే తాత్కాలికంగా తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను కేటాయించింది. దీంతో వైటీసీలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read Also: Vandhebharat Express: నేడు సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్లే వందేభారత్‌ రైలు రద్దు

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాకారంలో సమ్మక్క సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. 335 ఎకరాలకు గాను,50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పూర్తిస్థాయిలో భూసేకరణ కాగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాదులోని సెంట్రల్‌ యూనివర్సిటీ మెంటర్‌గా పనిచేస్తుందన్నారు. భూసేకరణ పూర్తికాగానే దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి భూమి పూజ చేపిస్తామన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమన్నారు. ఆర్కియాలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా 7 కోట్ల రూపాయలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 60 కోట్ల రూపాయలు అప్పగించి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: NDSA Committee: అన్నారం సరస్వతి బ్యారేజీకి ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల బృందం

అనంతరం రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ, మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. 2014లో యూనివర్సిటీ చట్టం విభజన బిల్లు పెట్టడం జరిగిందన్నారు. దాదాపు 900కోట్ల రూపాయలు గిరిజన యూనివర్సిటీకి కేటాయించి ప్రారంభించడం చాలా గొప్ప విషయమన్నారు. దేశ ప్రధాని సమ్మక్క-సారలమ్మ తల్లులతో పేరుతో యూనివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ములుగు జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు 35శాతం సీట్లు కేటాయించడం సంతోషమన్నారు.

 

Show comments