తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. ఇందులో భాగంగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కృష్ణమ్మ యాత్రను మక్తల్ కృష్ణ గ్రామంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో ఇదే కృష్ణా నుంచి తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించామని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవాలి అని శపథం చేస్తూ మళ్లీ ఇక్కడి నుంచే విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Varun Tej: జనసేనకు సపోర్ట్ చేస్తా, కానీ పవన్ సినిమాలో అలా చేస్తే చంపేస్తారు!
తెలంగాణలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా.. పేద వారికి ఇల్లు కట్టించ లేకపోయారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. కానీ దేశంలో ఎన్నో కోట్ల మందికి ప్రధాని మోడీ సొంత ఇళ్లు కట్టించారని తెలిపారు. మన రాష్ట్రంలో చాలా మందికి మోడీ పైసలు, మోడీ బియ్యం వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు తప్పా.. మిగతా రోడ్లు లేవని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కాయా, పీయా చలేగాయా అన్నట్లు వ్యవహరించిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం దొరికింది మింగారు.. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏది దొరుకుతుంది మింగుదం అని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనను ఇంటికి పంపితే.. రాహుల్ గాంధీ దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు.
Maratha Reservation bill: మరాఠా రిజర్వేషన్ బిల్లు ఆమోదం
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అధికారంలో లేకుంటే చాలా ఇబ్బందులు ఉండేవని అన్నారు. 500 సంవత్సరాలుగా పోరాడుతున్న రాముని గుడిని అయోధ్యలో కట్టుకున్నాం.. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం బీజేపీ, మోడీ వల్లే జరిగిందని అన్నారు. తెలంగాణలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్రలు జరుగుతున్నాయని.. తెలంగాణలో అన్ని పార్లమెంట్ సీట్లపై కాషాయ జెండా ఎగరాలని పురుషోత్తం రూపాలా తెలిపారు.